Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బాహుబ‌లి 2' మ‌రో రికార్డు... ట్విట్ట‌ర్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో మొద‌టి స్థానం

  • 2017 ట్రెండ్ వివ‌రాల‌ను వెల్ల‌డించిన ట్విట్ట‌ర్ ఇండియా
  • రెండో స్థానంలో 'బిగ్‌బాస్ 11'
  • మూడో స్థానంలో 'మెర్స‌ల్'
బాక్సాఫీస్ వ‌ద్ద మాత్ర‌మే కాదు... సోష‌ల్ మీడియాలో కూడా 'బాహుబ‌లి 2' చిత్రం రికార్డులు సృష్టించింది. తాజాగా ట్విట్ట‌ర్ ఇండియా విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం 2017లో భార‌త‌దేశంలో వినోదం కేట‌గిరీలో 'బాహుబ‌లి 2' చిత్రం టాప్ ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌గా నిలిచింది. ఆ త‌ర్వాతి స్థానంలో హిందీ 'బిగ్‌బాస్ సీజ‌న్ 11', మూడో స్థానంలో 'మెర్స‌ల్' చిత్రం నిలిచాయి. టాప్ 3లో రెండు ద‌క్షిణ భార‌త సినిమాలు ఉండ‌టం నిజంగా గ‌ర్వ‌కార‌ణం.

ఇక వార్త‌లు, రాజ‌కీయాల కేట‌గిరీలో 'దివాలీ', 'జీఎస్టీ', 'మ‌న్ కీ బాత్' ట్యాగ్‌లు ముందంజ‌లో ఉన్నాయి. క్రీడ‌ల కేట‌గిరీలో 'ఛాంపియ‌న్స్ ట్రోఫీ 17', 'ఇండియా వ‌ర్సెస్ పాక్‌', 'ఐపీఎల్‌', 'డ‌బ్ల్యూడబ్ల్యూసీ 17' ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్న‌ట్లు ట్విట్ట‌ర్ ఇండియా ట్వీట్ చేసింది.
baahubali 2
twitter
trending
diwali
gst
bigboss 11

More Telugu News